Header Banner

గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన.. అల్లూరి భూమిలో అభివృద్ధికి బాటలు! 200 రోడ్లకు వర్చువల్ శంకుస్థాపన!

  Mon Apr 07, 2025 09:09        Politics

ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోమవారం విశాఖ (Visakha) రానున్నారు. ఇక్కడ గిరిజన గ్రామాల్లో రెండు రోజులు పర్యటించనున్నారు. మొదటి రోజు ‘అడవి తల్లి బాట’ (Adavi Talli Baata) పేరుతో చేపట్టిన రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టునున్నారు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో గిరిజన ఆవాసాల సంరక్షణ, ముఖాముఖి కార్యక్రమాలు, బహిరంగ సభ నిర్వహిస్తారు. రెండవ రోజు మంగళవారం సుంకరమెట్ట ప్రాంతంలో నిర్మించిన వుడెన్ బ్రిడ్జ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖకు పయనమవుతారు.
పవన్ కల్యాణ్ పర్యటన వివరాలు..
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ నుంచి పెందుర్తి, అనంతగిరి, అరకులోయ మీదుగా రోడ్డు మార్గంలో డుంబ్రిగుడ చేరుకుంటారు. చాపరాయి జలవిహారిలో మత్స్యాలమ్మను సందర్శిస్తారు. అనంతరం చాపరాయి గెడ్డ మీదుగా పెదపాడు పీవీటీజీ గ్రామానికి చేరుకుంటారు. పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణాలను పరిశీలిస్తారు. గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. తరువాత డుంబ్రిగుడ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు.


ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి మరో బహుమతి! ఆ 11 నగరాల్లో! భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!


ఇక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేస్తారు. రాత్రికి అరకులోయ చేరుకుని ఏపీటీడీసీ అతిథిగృహంలో బస చేస్తారు. రెండో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు అరకులోయ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఇదే మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుంటారు. అటవీశాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నం పయనమవుతారు. డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, జేసీ అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, ఎస్పీ అమిత్‌ బర్ధార్‌ పర్యవేక్షిస్తున్నారు. కాగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో సోమవారం చాపరాయి జల విహారిలో పర్యాటకుల ప్రవేశాన్ని రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PawanKalyan #APDeputyCM #AlluriSeetharamaRaju #TribalDevelopment #AdaviTalliBaata